News February 6, 2025
‘ఈగల్’ వింగ్ విశాఖ సీఐగా ఎస్.రమేశ్

విశాఖపట్నం జిల్లా జోనల్ “ఈగల్” వింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా ఎస్.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి డయల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈయన విశాఖ జిల్లాలో 2010 నుంచి 2022 వరకు పలు విభాగలలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.
Similar News
News February 10, 2026
విశాఖ: గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

విశాఖలో నైపుణ్యాభివృద్ధి సంస్థ (SDI), నిరుద్యోగ యువతకు వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, డేటా ఎంట్రీ వంటి విభాగాల్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. SSC నుంచి B.Tech వరకు అర్హత ఉండి 18-28 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఉచిత భోజన, వసతితో శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి 20 లోపు ద్వారకానగర్‌లోని SDI కేంద్రంలో లేదా 79893 13189 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News February 10, 2026
ఏయూలో ఉచిత యోగా థెరపీ శిబిరాలు

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్‌వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.