News April 2, 2025

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన  భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలో పడవు పడిన ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి బీటెక్ ఫస్ట్ ఇయర్‌కి చదువుతున్న గంద జయన్ (18), బొడ్డు శ్యామ్ శరన్ (18) అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం నలుగురు విద్యార్థులు మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు ఈతరాక నీటిలో మునిగిపోయారు. పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

Similar News

News December 6, 2025

HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్‌కిల్’

image

HYDలో ఫుట్‌పాత్‌ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి

News December 6, 2025

KMR: బుజ్జగింపు పర్వం సక్సెస్ అయ్యేనా?

image

KMR జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు సొంత పార్టీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉంది. వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు బడా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రణరంగంలో ఉండేదేవరు? ఊడేదెవరు అన్నది పలు చోట్ల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెబల్స్ బెట్టు వీడతారా? లేక ఇండిపెండెంట్‌గా సై అంటారా? ఇవాళ సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ తప్పదు!