News April 11, 2024
ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లందు మండలం మామిడగుండాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా రేషన్ డీలర్‌గా పని చేస్తున్న ఎర్రిపోతుల బిక్షపతి స్నేహితులతో ఈతకి వెళ్లి మునిగిపోయాడు. బావిలో నీటిని మోటార్ల సహాయంతో తోడి ఆతనిని బయటకు తీసుకువచ్చారు. కొంత సేపటికి అతను మృతి చెందాడు.
Similar News
News March 26, 2025
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్‌ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..
News March 26, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
News March 26, 2025
ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో నగదు

రైతుభరోసా నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం రూ.60.87 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదెకరాల మేర సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. జిల్లాలో ఇంకా 86 వేల మంది రైతులకు వారికి ఉన్న భూమి ఆధారంగా రూ.156 కోట్ల సాయం అందాల్సి ఉంది.