News January 3, 2025

ఈనెల 10న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 5:15 లకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించుటకు ఏర్పాటు కొనసాగిస్తున్నారు. అలాగే ఐదు రోజులపాటు అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కరరావు తెలిపారు.

Similar News

News December 2, 2025

నల్గొండ: రేపు మూడో విడత నోటిఫికేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే NLG, CDR డివిజన్లలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

News December 1, 2025

చండూర్: ఏకగ్రీవాల పేరుతో ఓటు హక్కు దోపిడీ: రఫీ

image

చండూర్ మండల బంగారిగడ్డ పంచాయతీ రిజర్వేషన్‌ను అగ్రకుల పెత్తందారులు తమ అనుచరులతో దుర్వినియోగం చేస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రఫీ సోమవారం నల్గొండలో ఆరోపించారు. స్థానిక ఎన్నికలను డబ్బు ప్రలోభాలతో ఏకగ్రీవం పేరుతో హరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటు హక్కు హరించబడుతోందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలను చట్టపరంగా అడ్డుకుంటామని అన్నారు.

News December 1, 2025

నల్గొండ జిల్లాలో నేటి నుంచి కొత్త వైన్సులు!

image

జిల్లాలో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకాల పరిమితితో 154 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత షాపులకు గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే 154 వైన్స్‌ల లైసెన్స్ పొందిన వారు షాపులు తెరిచేందుకు అనుమతి పొందారు. కొత్తగా దుకాణాలు తెరిచే వ్యాపారులు ఇప్పటికే మద్యాన్ని డంపింగ్ చేసుకున్నారు.