News September 8, 2024

ఈనెల 11న కాళేశ్వరంపై ఎన్జీటీ విచారణ

image

కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రధాన బ్యారేజీలతో పాటు మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణానికి సంబంధించి చెన్నై హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈనెల 11న విచారణ చేపట్టనుంది. సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు మేరకు తొలుత ఢిల్లీ ఎన్జీటీ ధర్మాసనం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖలను ధర్మాసనం ఆదేశించింది.

Similar News

News October 30, 2025

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్‌.ఎన్‌. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

News October 30, 2025

బాధితులకు అండగా ఉండండి: వరంగల్ కలెక్టర్

image

భారీ వర్షాల ప్రభావంతో జలదిగ్బంధంలో ఉన్న ఎన్‌ఎన్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా స్వయంగా సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను మార్గనిర్దేశం చేస్తూ తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News October 29, 2025

కల్లెడ చెరువు కట్ట సురక్షితమేనా..?

image

తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షంలో అత్యధికంగా మండలంలోని కల్లెడలో ఉంది. వర్షంతో గ్రామంలో 36.7 సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో గ్రామంలోని చెరువుకట్ట పరిస్థితి ఏంటని గ్రామస్థులు భయపడుతున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు గ్రామంలోని చెరువు కట్టకు సమానంగా నీరు చేరడంతో బూర్గుమళ్ల వైపు కట్టని తొలగించి నీటిని తీసివేశారు. ప్రస్తుతం కట్ట పరిస్థితిపై గ్రామస్థులు భయపడుతున్నారు.