News September 10, 2024
ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక విధానం: కలెక్టర్
ఏలూరు జిల్లాలో ఈనెల 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం అమలవుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఇసుక సమన్వయ శాఖల అధికారులు, లారీ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. పారదర్శకంగా ఇసుక సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 14, 2024
ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News October 14, 2024
నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.
News October 14, 2024
బందోబస్తును పరిశీలించిన ఏలూరు ఎస్పీ
ఏలూరు జిల్లా వైన్స్ లాటరీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన చలసాని గార్డెన్‌లోని బందోబస్తు ప్రదేశాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.