News April 13, 2025
ఈనెల 14న జరిగే P.G.R.S రద్దు: కలెక్టర్

ఈనెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.
News December 1, 2025
ములుగు: పంతాలు, పట్టింపులు లేవు.. అన్నీ పంపకాలే..!?

ఉప్పు నిప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు పల్లెపోరులో పంతం వదులుతున్నాయి. నిన్నటి దాకా ఎదురుపడితే బుసలు కొట్టుకున్న నాయకులు సంధి రాజకీయాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డులను మీకిన్ని.. మాకిన్ని.. అంటూ పంచుకుంటున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన పంచాయతీల్లో ఈ పంపకాలు జోరందుకున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా నేతలు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ లోపు కొలిక్కి తెచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు.
News December 1, 2025
జగిత్యాల: బుజ్జగింపులు.. బేరసారాలు

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసి నేటి నుంచి 3 రోజులు విత్‌డ్రాకు గడువు ఉండడంతో అభ్యర్థులు బుజ్జగింపులు, బేరసారాలకు దిగుతున్నారు. తనకు మద్దతుగా విత్ డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులు తనకు పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తూ బేరసారాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.


