News December 2, 2024

ఈనెల 14న వాజేడు SI ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా!

image

వాజేడు ఎస్ఐ హరీశ్ తన<<14767070>> రివాల్వర్‌తో కాల్చుకొని<<>> మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా, ఈనెల 14న హరీశ్‌ ఎంగేజ్మెంట్ జరగనుందని స్థానికులు తెలిపారు. అంతేకాక ఎంగేజ్మెంట్‌కు సంబంధించి షాపింగ్ చేయాల్సి ఉందని, తన స్నేహితులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News March 11, 2026

KMM: నీరా కేఫ్‌ లీజుకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ‘నీరా కేఫ్‌’ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాల్లో నమోదై, నీరా సేకరణ అనుమతి ఉన్నవారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు వివరాల కోసం www.tgttcfc.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. గౌడ వృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 11, 2026

గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్‌.. విచారణకు ఆదేశం

image

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.

News March 11, 2026

ఖమ్మంలో రేపు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం మార్చి 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్ అర్హత కలిగిన 22-33 ఏళ్ల యువత సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.