News August 5, 2024

ఈనెల 15న జిల్లాలో సీఎం పర్యటన: మంత్రి తుమ్మల

image

ఈనెల 15న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నేతలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి తుమ్మల సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

image

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్‌లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

News November 25, 2025

ఎన్పీడీసీఎల్‌లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

image

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్‌కు, రమేష్ వైరా డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.

News November 25, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం
∆} ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం
∆} నేలకొండపల్లి, తల్లాడ రైతు వేదికల్లో రైతు నేస్తం
∆} రైతులతో వైరా ఎమ్మెల్యే సమావేశం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు