News January 11, 2026

ఈనెల 15 నుంచి 22 వరకు సింగోటం బ్రహోత్సవాలు

image

కొల్లాపూర్ మండలంలోని సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహోత్సవాలు ఈనెల 15 నుంచి 22 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్వయంభు లింగ రూపంలో విగ్రహం ఉండటంతో లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంగా పేరు పొందింది. రెండో యాదాద్రిగా పిలవబడుతున్న ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో జటప్రోలు సంస్థాన రాజు సురభి నర్సింగ భూపాలుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

Similar News

News January 16, 2026

జగిత్యాల: కులాంతర వివాహ జంటలకు రూ.37.50 లక్షల బాండ్ల పంపిణీ

image

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు పంపిణీ చేశారు. మొత్తం రూ.37.50 లక్షల విలువైన బాండ్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు.

News January 16, 2026

జగిత్యాల: ‘దివ్యాంగులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తా’

image

దివ్యాంగులకు అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వపరంగా కల్పిస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్ద మొత్తంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలోనే మొదట ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు.

News January 16, 2026

మేడారంలో క్యాబినెట్ మీటింగ్.. ఆఫీసర్స్ అలర్ట్..

image

మేడారం ఆధ్యాత్మిక కేంద్రమే కాక రాజకీయంగా చరిత్ర సృష్టించబోతోంది. ఈనెల 18న ఇక్కడ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. తొలిసారి సచివాలయం బయట జరుగుతున్న ఈ మీటింగ్ కోసం యావత్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం ప్రభుత్వమే మేడారంలో కొలువుదీరుతుండగా ఏ చిన్న సంఘటన జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. మంత్రి సీతక్క మేడారంలో పర్యటించారు. హెలీప్యాడ్, టెంట్ సిటీ, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.