News March 9, 2025

ఈనెల 16న ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ 

image

ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను ఈ నెల 16వ తేదీన ఆంధ్ర లయోలా కాలేజీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వైఈఎస్- జె వ్యవస్థాపకులు, డైరెక్టర్ బి. బాలకుమార్, మ్యాజిక్ యూత్ ప్రతినిధి హర్షిత తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను లయోలా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 

Similar News

News January 25, 2026

కాజీపేట మీదుగా పలు రైళ్ల రద్దు..!

image

కాజీపేట-బల్లార్షా సెక్షన్‌లో మందమర్రి-బెల్లంపల్లి మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-సిర్పూర్ టౌన్ (17003), బల్లార్షా-కాజీపేట మెమూ (17004), బల్లార్షా-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (17036), కాజీపేట-బల్లార్షా ఎక్స్‌ప్రెస్ (17035) రైళ్లు పూర్తిగా రద్దు చేశారు.

News January 25, 2026

నెల్లూరు: 54 మంది అరెస్ట్

image

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.

News January 25, 2026

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి పంచామృతాలతో విశేషమైన అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.