News November 14, 2024
ఈనెల 16న కరీంనగర్‌కు టీపీసీసీ చీఫ్

ఈనెల 16న కరీంనగర్‌లో TPCC అధ్యక్షులు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా గార్డెన్స్‌లో KNR పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో సమగ్ర కుటుంబ సర్వే, పార్టీ సమన్వయం, స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన, తదితర అంశాలపై చర్చ కొనసాగుతుందన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని MLA డా.కవ్వంపల్లి పిలుపునిచ్చారు.
Similar News
News March 10, 2026
KNR: ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై దాడులు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్‌పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్‌ను సీజ్ చేసిన అధికారులు, తయారీదారులు వెంటనే లైసెన్సులు పొందాలని ఆదేశించారు.
News March 9, 2026
ప్రజావాణికి 352 దరఖాస్తులు: కలెక్టర్ చిత్రా మిశ్రా

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 352 దరఖాస్తులను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.
News March 8, 2026
కరీంనగర్‌లో రేపు 2కే రన్

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో MCK నుండి అంబేద్కర్ స్టేడియం వరకు రేపు ఉదయం 6.30 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్పొరేషన్ లో E-వేస్ట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.


