News December 10, 2024
ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16న ప్రారంభం కానుంది. ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు.
Similar News
News October 28, 2025
అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోండి: కలెక్టర్

తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సుమిత్ కుమార్ తెలిపారు. దీనిపై ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. వార్తా సమాచారం కోసం ఫోన్లలో గమనిస్తూ ఉండాలని కోరారు. అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 27, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు