News September 10, 2024

ఈనెల 17 వరకు సింహాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు

image

సింహాచలం ఆలయంలో ఈనెల 13 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, వేద పారాయణం, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఈనెల 13 నుంచి ఆర్జిత సేవలతో పాటు నిత్య కళ్యాణ ఉత్సవాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత స్వామి దర్శనాలు లభించవన్నారు.

Similar News

News September 15, 2025

విశాఖలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ

image

విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్‌ చేశారు. ఎంవీపీ లా అండ్‌ ఆర్డర్‌ సీఐగా ప్రసాద్, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.

News September 15, 2025

విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

image

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.

News September 15, 2025

మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

image

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.