News November 17, 2024

ఈనెల 18న అభ్యర్థులకు కౌన్సెలింగ్

image

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో వార్డెన్లు, పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 18న కర్నూలులోని డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు.

Similar News

News November 5, 2025

11 కంపెనీలలో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూ

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. 11 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.

News November 4, 2025

లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎస్సై శివాంజల్‌తో కలిసి పరిశీలించారు. తుంగభద్ర నది తీరంలో పుణ్య హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీ మఠం అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సై శివాంజల్‌కు సూచించారు.

News November 4, 2025

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.7,555

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.