News October 15, 2024
ఈనెల 18న కల్లుగీత కార్మిక సంఘం వార్షికోత్సవం

కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాన్ని ఈనెల 18న హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. వార్షికోత్సవానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరవుతారు అని తెలిపారు.
Similar News
News December 12, 2025
HYD: ITI చేశారా? జాబ్ కొట్టండి..!

జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య తెలిపారు. చర్లపల్లిలో ఉన్న కంపెనీలో టెక్నికల్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారన్నారు. మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా ఉంటుందన్నారు. ఫిట్టర్, వెల్డర్లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.
News December 12, 2025
HYDలో కొత్త బస్సులు.. డోర్ క్లోజ్ అయితేనే కదలేది!

నగరంలో కొత్త బస్సులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయంగా ఉండటంతో పాటు భద్రతా చర్యలు ఈ బస్సుల్లో ఏర్పాటు చేశారు. 65 ఎలక్ట్రిక్ బస్సులు సిటీలో దూసుకెళ్తున్నాయి. బస్సులో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంచారు. డోర్ క్లోజ్ అయితేనే బస్సు ముందుకు వెళ్లేలా దీన్ని రూపొందించారు.
News December 12, 2025
HYDలో బయట తిరిగితే 4సిగరెట్లు కాల్చినట్లే!

నగరంలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 12 శాతం వాయుకాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డిసెంబర్ నెల AQI 178గా నమోదైంది.


