News October 15, 2024

ఈనెల 18న కల్లుగీత కార్మిక సంఘం వార్షికోత్సవం

image

కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాన్ని ఈనెల 18న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. వార్షికోత్సవానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరవుతారు అని తెలిపారు.

Similar News

News November 11, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చలి!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్‌చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్‌, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.

News November 11, 2024

HYD: శంషాబాద్‌కు అఘోరీ

image

శంషాబాద్‌లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి ప్రకటించారు. ఏపీ గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె ఆదివారం మాట్లాడారు. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.

News November 11, 2024

HYD: బండి సంజయ్ దళిత వ్యతిరేకి: డా. లింగస్వామి

image

తెలంగాణ ఉన్నత విద్యా కమిషన్ రద్దు చేయాలని, ఛైర్మన్‌గా నియమించబడ్డ ఆకునూరి మురళిని తొలగించాలనడం బండి సంజయ్‌కి దళితుల మీదున్న వ్యతిరేకతకు నిదర్శనమని అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా. మంచాల లింగస్వామి ఆరోపించారు. బండి సంజయ్, BJP దళితులకు వ్యతిరేకమని, దళిత ఐఏఎస్ అధికారిని తొలగించాలన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి అనర్హుడని, ఆయనను బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.