News June 14, 2024

ఈనెల 18న వరంగల్ నిట్‌లో ఓపెన్ హౌస్

image

జేఈఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 18న నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జేఈఈలో అర్హత సాధించి ఇంజినీరింగ్ కళాశాలను ఎంచుకునేందుకు గాను ఈ అవగాహన తోడ్పడుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అవగాహన నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ప్రత్యేకతనూ తెలియజేయనున్నారు.

Similar News

News December 8, 2025

రాష్ట్రస్థాయి పోటీకి పర్వతగిరి, రోల్లకల్ పాఠశాలలు

image

పాఠశాలల్లో సకల సౌకర్యాలు కలిగి ఉన్న పాఠశాలల విభాగంలో రాష్ట్రస్థాయికి పర్వతగిరి జిల్లా పరిషత్ పాఠశాల, రోల్లకల్ యుపీఎస్ పాఠశాలలు ఎంపికయ్యాయి. హరిత ఏవం స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ (SHVR) జిల్లాస్థాయిలో 8 పాఠశాలల్లో ఒకటిగా నిలచి రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్, పరిశుభ్రత తదితర విభాగాల్లో ఉత్తమంగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీల్లో నిలవడంతో ఎంఈఓ లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News December 8, 2025

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఈ నెల 11న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరగనున్న పోలింగ్–కౌంటింగ్ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, తాగునీరు, ర్యాంపులు, విద్యుత్ వంటి వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News December 7, 2025

WGL: పంచాయతీ ఎన్నికల సమాచారం లోపం.. మీడియాకు ఇబ్బందులు!

image

జిల్లాలో GP ఎన్నికల వివరాలు పత్రికలు, మీడియాకు చేరవేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనా, అర్ధరాత్రి వివరాలు ఇస్తామని DPO చెప్పగా, సమాచార శాఖ పాత డేటానే పంపడంతో తాజా సమాచారం మాయం అయింది. గతంలో 50 మండలాల డేటాను సమయానికి అందించిన యంత్రాంగం, ఇప్పుడు 11 మండలాల వివరాలకే తంటాలు పడుతోంది. వాట్సాప్‌కే పరిమితమైన సమాచార పంపిణీతో ఇబ్బందవుతోంది.