News July 11, 2024

ఈనెల 19న కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19న జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ జీ.నాసర రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు హాజరవుతారన్నారు.

Similar News

News February 13, 2025

కర్నూలు: టెన్త్ అర్హత.. 70 కంపెనీల్లో ఉద్యోగాలు

image

ఆలూరులోని ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బహుజన టైమ్స్ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 13, 2025

ఎమ్మిగనూరులో పర్యటించిన ఎస్పీ, మాజీ ఐజీ ఇక్బాల్

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ సందర్శించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. బాలికలకు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలు పాఠశాలకు వస్తున్న సమయంలో గానీ, బయట గానీ ఎవరైనా ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 12, 2025

మార్కెట్లోకి BE6, XEV9 కార్లు

image

అనంతపురం MGB మొబైల్స్ మహీంద్రా బ్రాంచ్ ప్రతినిధులు BEV BE6, XEV9E మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. మహీంద్రా AI ఆర్కిటెక్చర్, 110 cm వైడ్ సినిమా స్కోప్ లగ్జరీ డిస్‌ప్లేతో పాటు Z క్లాస్ సెక్యూరిటీతో 5 కెమెరాలను కలిగి ఉంది. ఆటో పార్కింగ్ సదుపాయం కూడా ఉండగా దీని ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. ఏపీలో దీనిపై లైఫ్ టాక్స్ లేదు.

error: Content is protected !!