News April 18, 2024
ఈనెల 20న అనకాపల్లికి సీఎం జగన్: ఎంపీ
ఈనెల 20న అనకాపల్లి జిల్లాలోకి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’బస్ యాత్ర ప్రవేశిస్తుందని ఎంపీ బీవీ సత్యవతి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌తో కలిసి ఆమె గురువారం మాట్లాడారు. కసింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోని చింతలపాలెం పంచాయతీ వద్ద సాయంత్రం 4 గంటలకు జగన్ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Similar News
News September 20, 2024
విశాఖ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మోకా’కు చోటు
మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్‌తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.
News September 20, 2024
విశాఖ: యార్లగడ్డ సహాయం కోరిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి
మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సహాయ సహకారాలను అందించాలంటూ పిలుపు వచ్చింది. అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న అమెరికా తొలి మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ కోరారు. ఈ మేరకు వారిద్దరూ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈమెయిల్ సందేశాలు వంపినట్లు లక్ష్మీ ప్రసాద్ కార్యదర్శి ఎస్.బాబయ్య తెలిపారు.
News September 20, 2024
వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.