News June 20, 2024
ఈనెల 20న ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
2023 రబీ పంటలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో జిల్లా అధికారులతో కలిసి కేంద్రం బృందం పర్యటించనుంది. తర్లుపాడు మండలంలోని పోతలపాడు, గానుగపెంట, మార్కాపురం మండలంలో వేములకోట, పెద్దారవీడు మండలంలో గొబ్బూరులో రైతులను కలిసి పంట నష్టం వివరాలు, తాగునీటి కొరత తదితర విషయాలపై ఆరా తీయనున్నారు.
Similar News
News September 18, 2024
ప్రకాశం: ‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
News September 18, 2024
బాలినేని వైసీపీ వీడటానికి ఇవి కూడా కారణమయ్యాయా..?
బాలినేని శ్రీనివాసరెడ్డి 1999నుంచి చాలా ఏళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్, వైసీపీలోనూ ఆయన హవా కొనసాగింది. కాగా, YCP ప్రభుత్వ హయాంలో క్యాబినేట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోవడం, ఆయన సూచించిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు, తాజా ఎన్నికల్లో ఓటమి, ఇతరత్రా కారణాలతో ఆయన వైసీపీని వీడినట్లు తెలుస్తోంది.
News September 18, 2024
చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి
చీరాల నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటుచేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంత్రి నారా లోకేష్‌ను కోరారు. బుధవారం ఆయన మంత్రిని కలిసి హబ్ ఏర్పాటుకు సంబంధించిన వసతుల గురించి తెలియజేశారు. హబ్ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి హబ్ ఏర్పాటుకు కృషిచేస్తామని లోకేశ్ తెలిపారు.