News January 20, 2025

ఈనెల 20 నుంచి పశు ఆరోగ్య శిబిరాలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

Similar News

News December 9, 2025

13న నరసాపురంలో జాతీయలోక్ అదాలత్: జడ్జి

image

ఈ నెల 13న నర్సాపురంలోని అన్ని కోర్టు సముదాయాలలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమాకు సంబంధించిన కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలు రాజీ చేసుకోవచ్చని చెప్పారు.

News December 9, 2025

ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.

News December 9, 2025

భీమవరం: Way2News ఎఫెక్ట్.. ఉపాధ్యాయుడి సస్పెండ్

image

భీమవరం (M) గొల్లవానితిప్ప ZP హైస్కూల్లో లెక్కల మాస్టర్‌గా పనిచేస్తున్న సుధీర్ బాబును<<18500702>> సస్పెండ్<<>> చేస్తూ DEO నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్టర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈనెల 5న ఆయనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా విచారణకు ఆదేశించామన్నారు. విచారణలో ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై సోమవారం Way2News కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.