News June 25, 2024
ఈనెల 20 సింహాచలంలో గిరి ప్రదక్షిణ

సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షణను విజయవంతం చేయాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ఆలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమీక్షలో ఆయన మాట్లాడుతూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాలన్నారు.
Similar News
News November 22, 2025
కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

కంచరపాలెం రైతు బజార్కు 880 గ్రాములు క్యారేట్ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.
News November 22, 2025
విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.


