News July 19, 2024
ఈనెల 21న పుట్టపర్తికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాక

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి ఈనెల 21న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలను సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 21న ఉదయం బెంగళూరు నుంచి రహదారి మార్గం గుండా పుట్టపర్తికి చేరుకుంటారు. గురుపౌర్ణమి వేడుకల అనంతరం తిరిగి వెళ్తారు.
Similar News
News September 19, 2025
అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

అనంతపురం: వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు. యూరియా పంపిణీ అవసరం ఉన్న చోట తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు.
News September 18, 2025
ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
News September 18, 2025
ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.