News August 21, 2024
ఈనెల 22న ధర్నాను విజయవంతం చేయాలి: దాస్యం
కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజును చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్డుపాలు చేసిందని మాజీ MLA వినయ్ భాస్కర్ అన్నారు. బుధవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22న ఏకశిలా పార్క్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడుతామన్నారు.
Similar News
News September 19, 2024
వరద ప్రభావిత పరిస్థితులపై మంత్రి సీతక్క సమీక్ష
మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత పరిస్థితులు, చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను జిల్లాలో వరదల చర్యలపై పలు వివరాలను సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News September 19, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్.
> MLG: ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
> WGL: గణపతి నిమర్జనం ట్రాక్టర్ ను ఢీకొన్న అంబులెన్స్
> MLG: అడవి పందులను హతమార్చిన ముగ్గురి అరెస్ట్
> JN: ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మరంలో మంటలు
> MLG: గడ్డి మందు తాగి యువకుడు మృతి
> MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి
> MLG: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
> VKP: విష జ్వరంతో మహిళ మృతి
> WGL: నర్సంపేటలో ఉరి వేసుకుని ఒకరి మృతి
News September 18, 2024
దేవదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష
ప్రముఖ ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.