News March 17, 2025
ఈనెల 23న కరీంనగర్కు కేటీఆర్..!

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని BRS పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News September 15, 2025
కరీంనగర్: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్లోని కిసాన్నగర్లో గంగుల సురేష్ అనే వ్యక్తి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
KNR: ‘పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి’

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.
News September 15, 2025
“ఉల్లాస్” నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో కరీంనగర్

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఉల్లాస్లో భాగంగా జిల్లాలో 32777 మంది నమోదు లక్ష్యం నిర్ణయించగా 69958 మందిని ఈ కార్యక్రమంలో చేర్పించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ లో అడ్మిషన్లు, స్వయం సహాయక సంఘాల్లో బాలికలు, వయోవృద్ధులు, దివ్యాంగులను చేర్పించడం వంటి కార్యక్రమాల్లోనూ జిల్లా ముందు వరుసలో ఉంది. అధికారులను కలెక్టర్ అభినందించారు.