News August 22, 2024

ఈనెల 23న ఖమ్మంలో జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్హత ఏదైనా డిగ్రీ అని, 20-33 ఏళ్లు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు.

Similar News

News February 12, 2025

ఖమ్మం: రూ.91 లక్షలకు వ్యాపారి దివాలా పిటిషన్

image

ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.91,04,593 లకు దివాళా పిటిషన్‌ దాఖలు చేశాడు. ఫిర్యాదుదారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు పలువురి వద్ద అప్పు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో పదిమంది రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ దివాలా పిటిషన్ మంగళవారం స్థానిక కోర్టులో దాఖలు చేశాడు.

News February 12, 2025

KMM: పారిశుద్ధ్యంపై.. ఆలోచింపజేస్తున్న బొమ్మలు

image

ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం కాల్వ ఒడ్డు నుంచి పాత బస్టాండ్ రైల్వే ఫ్లై ఓవర్‌పై క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల కింద గోడల మీద గీసిన పెయింటింగ్ బొమ్మలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రయాణికులు, ప్రజలు వీటిని చూసి బాగున్నాయని కితాబు ఇస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్యానికి ప్రజలు తమ వంతుగా పాటుపడాలని కోరుతున్నారు.

News February 11, 2025

భద్రాద్రి: విధుల్లోనూ విడవని తల్లి ప్రేమ

image

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్‌కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.

error: Content is protected !!