News December 23, 2024
ఈనెల 24న కడప జిల్లాకు YS జగన్

ఈనెల 24న కడప జిల్లాకు YS జగన్ రానున్నారు. అనంతరం జిల్లాలో 4 రోజులపాటు పర్యటించనున్నారు. 24వ తేదీన ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 25న పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేస్తారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 27న తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.
Similar News
News December 16, 2025
కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ?

కడప జిల్లా TDP అధ్యక్షుడి రేసులో ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు TDP ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన టికెట్‌ను త్యాగం చేయడం, అలాగే అవినాశ్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన భూపేశ్‌కు పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు తీసుకొని నడిపించిన వాసునే కొనసాగించాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News December 16, 2025
క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News December 16, 2025
కడప జిల్లాకు జోన్-5 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో కడప జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.


