News August 22, 2024

ఈనెల 24న కాకినాడలో జాబ్ మేళా

image

ఈనెల 24న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.

Similar News

News December 3, 2025

CM చంద్రబాబు నల్లజర్ల షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 11:20కి నల్లజర్ల చేరుకుంటారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 11:20–11:40 AM రైతన్నా–మీ కోసం స్టాళ్ల పరిశీలన, 11:45AM వేదిక వద్దకు చేరుకుంటారు. కలెక్టర్ స్వాగత ప్రసంగం. 11:50 AM–12:15 PM రైతులతో సీఎం పరస్పర చర్చ ఉంటుందన్నారు. 12:15–12:20 PMఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రసంగం, రైతులకు సన్మానం, 1.15 గంటలకు పార్టీ కేడర్‌తో సమావేశం అవుతారన్నారు.

News December 3, 2025

ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

image

ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్‌లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News December 3, 2025

రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

image

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.