News November 17, 2024
ఈనెల 24న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష: DEO

ఖమ్మం: 2024-25 విద్యా సం.కి గాను నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ తెలిపారు. ఉ.9-30 నుంచి మ.12:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. కావున విద్యార్థులు తమ పరీక్షా హాల్ టికెట్లను వెబ్సైట్ https://bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
ఖమ్మం: మహిళలకే 259 సర్పంచ్ స్థానాలు

ఖమ్మం జిల్లాలోని 566 పంచాయతీలకు, 5,166 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఎస్టీలకు 166, ఎస్సీలకు 110, బీసీలకు 54, జనరల్ స్థానాలు 236 కేటాయించారు. జిల్లావ్యాప్తంగా మహిళలకు 259 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా, మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.