News March 24, 2025

ఈనెల 24న పుట్టపర్తి కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక.!

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజల సమస్యలు అర్జీ రూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని అన్నారు.

Similar News

News April 17, 2025

గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

image

TG: గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకూ గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది.

News April 17, 2025

నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.

News April 17, 2025

ప్రొద్దుటూరులో ఒకేరోజు 60 తులాల బంగారం చోరీ.. 18 కేజీల పసిడి పట్టివేత

image

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యెనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపున స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఒక కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.

error: Content is protected !!