News October 22, 2024
ఈనెల 25న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గవర్నర్ పర్యటన

భద్రాద్రి ఖమ్మం జిల్లాలో ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం భద్రాద్రి స్వామివారిని దర్శించుంటారు. అనంతరం పాల్వంచ జిల్లా కలెక్టరేట్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని అక్కడ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
2వ రోజు 383 నామినేషన్లు దాఖలు.!

ఖమ్మం జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 మండలాల్లో సోమవారం సర్పంచ్ల పదవికి 383.. వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో కలిపి కామేపల్లిలో S-49 W-142, KMM(R) S-65 W-167, KSMC S-87 W-153, MGD S-78 W-160, NKP S-70 W-155, T.PLM S-79 W-154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో 2వ విడత నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.
News December 2, 2025
ఖమ్మం: ఏఎన్‌ఎం కోర్సు ప్రవేశాలకు నేడే ఆఖరు

ఖమ్మం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా-శిశు వికాస కేంద్రంలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంపీహెచ్‌డబ్ల్యూ (మహిళా)/ఏఎన్‌ఎం కోర్సు ప్రవేశాలకు మంగళవారం చివరి గడువు అని మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ఉచిత శిక్షణలో బీసీ-సీ, ఈ, ముస్లిం మైనారిటీలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 76600 22512ను సంప్రదించవచ్చు.
News December 2, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో Dy.CM భట్టి విక్రమార్క పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన


