News October 22, 2024
ఈనెల 25న నూజివీడులో జాబ్ మేళా

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్డీసీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ వాడపల్లి కిషోర్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు ఉన్న యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 20, 2025
కృష్ణా: పంచాయితీలలో నిధుల గోల్మాల్.. రికవరీ ఆదేశాలు.!

ఉంగుటూరు MPDO 2019-21 వరకు నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. జ్యోతి హయంలో రూ.58.56లక్షల నిధులు పక్కదారిలో వినియోగించబడినట్లు గుర్తించబడింది. పెద్దఅవుటపల్లి రూ.43.84లక్షలు, పొట్టిపాడు రూ.13.35లక్షలు, Nఅప్పారావుపేట రూ.1.37లక్షలు దారి మళ్లాయి. కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అమీర్ బాషకు సంబంధించిన రూ.29.28లక్షలు MPDO ద్వారా దుర్వినియోగం అయిందని తేలడంతో కలెక్టర్ రికవరీ చర్యలకు ఆదేశించారు.
News November 19, 2025
కృష్ణా: 1.33 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1,33,856 మంది రైతులకు 2వ విడత రూ. 88.49 కోట్ల ఆర్థిక సాయం మంజూరైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మెగా చెక్కును మంత్రి రవీంద్ర రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపిచంద్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని, తదితరులు పాల్గొన్నారు.
News November 19, 2025
వైఎస్ జగన్ని కలిసిన కొడాలి, పేర్ని, వల్లభనేని

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, తదితర అంశాలు గురించి జగన్ వారితో చర్చించారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారా.? అనేది ఈ భేటీకి ప్రాధాన్యత సతరించుకుంది.


