News October 22, 2024

ఈనెల 25న నూజివీడులో జాబ్ మేళా

image

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్డీసీ ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ వాడపల్లి కిషోర్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు ఉన్న యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 13, 2024

గన్నవరంలో బాలికపై అత్యాచారం

image

గన్నవరంలో ఓ బాలికపై కొన్నాళ్లుగా అదే ఊరికి చెందిన ప్రశాంత్ అలియాస్ బన్ను అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలికకు కడుపునొప్పి రాగా తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంలో గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.  

News November 13, 2024

60 ఏళ్ల వయస్సులో బంగారు పతకాల పంట

image

కృష్ణా జిల్లా పెడనకు చెందిన భీమేశ్వరరావు(60) జగ్గయ్యపేటలో 10వ తారీఖున జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 3 బంగారు పథకాలు సాధించారు. దీంతో ఈ వయసులో కూడా అతని ఫిట్నెస్ చూసి జనం ఆశ్చర్యపోయారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే భీమేశ్వరరావు పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో 14 పతకాలను గెలిచాడు. ఈ ఘనతకు కారణం కోచ్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు.

News November 13, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

image

కృష్ణా: APCRDAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్ & సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, అప్లై చేసేందుకు https://crda.ap.gov.in/Careers/General అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.