News October 24, 2024
ఈనెల 25 నుంచి జిల్లాలో పశుగణన ప్రారంభం

ఈనెల 25 నుంచి అన్నమయ్య జిల్లాలో పశుగణన ప్రారంభమవుతున్నట్లుగా, దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లైతో కలిసి పోస్టర్లను ప్రారంభించారు. పశుగణన భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని అన్నారు.
Similar News
News December 13, 2025
వరంగల్లో బద్వేల్కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

కడప జిల్లా బద్వేల్కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
News December 13, 2025
కడప జిల్లాకు భారీగా నిధులు

కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.5కోట్ల నిధులు నీతి అయోగ్ విడుదల చేసిందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్, ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి అయోగ్ కార్యదర్శి శేఖర్కు కలెక్టర్ శ్రీధర్ న్యూఢిల్లీలో వివరించారు.


