News April 18, 2024
ఈనెల 25 వరకు బుకింగ్స్ పొడిగింపు: రీజనల్ మేనేజర్

శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు టిఎస్ ఆర్టిసి కార్గో ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బుకింగ్స్ ఈనెల 25 వరకు పొడిగించడం జరిగిందని.. కావున భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు
Similar News
News October 22, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు సీసీ టీవీ ఇన్స్టలేషన్ అండ్ సర్వీసింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 13 రోజుల శిక్షణలోయూనిఫామ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News October 21, 2025
నర్సింగ్ కళాశాల పనులు వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ₹25 కోట్లతో కళాశాల బ్లాక్ (G+2), హాస్టల్ (G+3) నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన సానిటరీ, వాల్ పుట్టి పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
News October 21, 2025
జాతీయ రహదారి భూసేకరణ నవంబర్లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సమస్యలను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేసి, ఎన్హెచ్ఏఐకి భూ బదలాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు మెరుగైన పరిహారం అందుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న భూములకు పరిహారం చెల్లింపులు, రీ-సర్వే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముగించాలని ఆయన ఆదేశించారు.