News April 24, 2025
ఈనెల 26న మహబూబాబాద్‌లో జాబ్ మేళా

ఈనెల 26న మహబూబాబాద్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో జిల్లాలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు టెన్త్, ఆ పైన విద్యార్హత కలిగిన పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్ఆర్ 8374054911కు సంప్రదించలన్నారు.
Similar News
News April 25, 2025
బెట్టింగ్ యాప్‌లపై విచారణ.. మెట్రో ఎండీకి నోటీసులు

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లను నిషేధించినా మెట్రో రైళ్లలో ప్రకటనలు రావడంపై కోర్టు మండిపడింది. ఆ ప్రకటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
News April 25, 2025
ఆస్తి గొడవ.. ముగ్గురి జైలుశిక్ష: ఏర్పేడు సీఐ

ఏర్పేడు మండలం ముసలిపేడులో 2017 మే 11న జరిగిన హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ముగ్గురికి జీవితకాలం కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ శ్రీకాళహస్తి 12వ అడిషనల్ జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ తీర్పు చెప్పారని ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. ఆస్తి గొడవల కారణంగా సుజాత, ఆమె భర్త, తల్లి వెంకటేశులు, రాణెమ్మతో కలిసి సుజాత అన్న సుబ్రహ్మణ్యం భార్య సుబ్బమ్మను హత్యచేశారు.
News April 25, 2025
KMR: ప్రియుడితో కలిసి భర్తను చంపింది

రామారెడ్డి PSలో ఏడాది క్రితం మిస్సైన కేసును పోలీసులు చేధించారు. ASP చైతన్యరెడ్డి వివరాలిలా.. ఇస్సన్నపల్లి వాసి తిరుపతి భార్య మనెవ్వకు లింబయ్యతో అక్రమ సంబంధం ఏర్పడిందని తేలింది. తిరుపతి అడ్డుగా ఉన్నాడని లింబయ్య మరో ఇద్దరితో కలిసి తిరుపతిని మందు తాగుదాం అని చెప్పి డొంకల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.