News March 23, 2025
ఈనెల 26న యాదాద్రి శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 26న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.
News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
News December 10, 2025
ప.గో: పందెం కోళ్లకు బౌన్సర్ల సెక్యూరిటీ కావాలేమో..!

సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ కోళ్ల ఫోటోలు పెట్టి అడ్వాన్సుల పేరుతో మోసగిస్తున్నారు.


