News March 24, 2025

ఈనెల 26న విజయవాడ రానున్న వైఎస్ జగన్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 26న విజయవాడకు రానున్నారు. YSRCP ఆధ్వర్యంలో ఈనెల 26న నగరంలోని NAC కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఇఫ్తార్ విందుకు జగన్ హాజరవుతారని ఎన్టీఆర్ జిల్లా YSRCP పార్టీ ప్రెసిడెంట్ దేవినేని అవినాశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలతో చర్చించామని ఆయన తెలిపారు. 

Similar News

News December 3, 2025

రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామపంచాయతీల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండటంతో రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు. ‘ఈసారి తప్పుకో.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామంటూ’ ఆయా గ్రామ పంచాయతీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. అలాగే రహస్య సమావేశాలు జరుపుతూ పరస్పర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

News December 3, 2025

గద్వాల: ఎన్నికల సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్

image

గద్వాల కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్‌తో కలిసి కలెక్టర్ సంతోష్ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు 974 పీఓలు, 1,236 ఓపీఓలు సహా మొత్తం 2,210 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా ఈ సిబ్బందిని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

News December 3, 2025

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

image

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.