News March 24, 2025
ఈనెల 26న విజయవాడ రానున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 26న విజయవాడకు రానున్నారు. YSRCP ఆధ్వర్యంలో ఈనెల 26న నగరంలోని NAC కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఇఫ్తార్ విందుకు జగన్ హాజరవుతారని ఎన్టీఆర్ జిల్లా YSRCP పార్టీ ప్రెసిడెంట్ దేవినేని అవినాశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలతో చర్చించామని ఆయన తెలిపారు.
Similar News
News July 11, 2025
ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు
News July 11, 2025
బిజినెస్ అప్‌డేట్స్

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు
News July 11, 2025
ఉమ్మడి విశాఖలో పొలిటికల్ హీట్

ఉమ్మడి విశాఖలో పొలిటికల్ హీట్ రాజుకుంది. జడ్పీ ఛైర్పపర్సన్ సుభద్ర పనితీరుపై అసంతృప్తితో ఉన్న 22 మంది ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. అసంతృప్తిలో ఉన్న ZPTCలతో బొత్స సత్యనారాయణ విశాఖ క్యాంప్ ఆఫీసులో నేడు సమావేశం కానున్నారు. వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం.