News April 24, 2024

ఈనెల 26 లోగా దరఖాస్తు చేయాలి: కలెక్టర్

image

ఎన్నికల అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఫారం-12 దరఖాస్తుకు ఎన్నికల గుర్తింపు కార్డు ఎన్నికల విధుల నియామక పత్రం జతచేసి నోడల్ అధికారి ద్వారా వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు.

Similar News

News November 29, 2025

విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి మండలం దిబ్బడిపాలేనికి చెందిన చిన్మయ ఆనంద్‌ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిచూసి CPR చేసి వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ అమర్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News November 29, 2025

విశాఖ: ‘ఉచిత శిక్షణ.. డిసెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబరు 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు సర్దార్ గౌతులచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. ప్రవేశ పరీక్ష కూడా డిసెంబరు 7కి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు చెందిన, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల నేరుగా ఎంవీపీ కాలనీ 6వ సెక్టార్లోని కార్యాలయంలో తమ దరఖాస్తులు అందజేయాలన్నారు.

News November 29, 2025

విశాఖ: రైలులో నొప్పులు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పితో అస్వస్థతకు లోనైంది. అధిక రక్తపోటు లక్షణాలు కనిపించడంతో స్టేషన్ చేరుకున్న వెంటనే గేట్ నెం.1 వద్ద ఉన్న అంబులెన్స్‌‌‌లో డా.భాషిణి ప్రియాంక నేతృత్వంలో తక్షణ చికిత్స అందించగా సాధారణ ప్రసవం జరిగింది. అనంతరం తల్లి, శిశువుకి రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందించి, KGHకి తరలించారు.