News March 21, 2025
ఈనెల 27న జిల్లా, మండల పరిషత్ సభ్యుల ఎన్నికలు

కర్నూలు జిల్లా, మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, MPP పదవుల భర్తీకి ఈనెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్ గతేడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈఏడాది జనవరి 1న మృతిచెందారు. వెల్దుర్తి, తుగ్గలి MPPలు శారద, ఆదెమ్మ రాజీనామా చేశారు. ఈ 4 పోస్టులకు ఈనెల 23న నోటిఫికేషన్ ఇచ్చి, 27న మధ్యాహ్నం సభ్యులను ఎన్నుకుంటారు.
Similar News
News December 5, 2025
కష్టాలకు తలొగ్గవద్దు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది: కేసీఆర్

TG: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ సీఎం KCR సూచించారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు సభ్యులు ఆయనను కలిశారు. BRS అధినేత వారిని సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా KCR మాట్లాడుతూ ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అధైర్యపడకుండా ముందుకు నడవాలి’ అని చెప్పారు.
News December 5, 2025
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: కలెక్టర్

నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులందరూ విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే రోజే ఉప సర్పంచ్ ప్రక్రియ ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
News December 5, 2025
ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.


