News December 24, 2024

ఈనెల 27న ధర్నా చేస్తాం: విజయసాయిరెడ్డి

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 23, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: CP

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఈనెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్, GVMC ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

image

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.