News June 21, 2024
ఈనెల 27న యాదాద్రి హుండీ లెక్కింపు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 27న లెక్కించనున్నట్లు గురువారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం హాల్ 2లో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లతో.. భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
NLG: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. “అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
News December 10, 2025
నల్గొండ: అప్పులు.. పదవి కోసం తిప్పలు

నల్గొండ జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు ఎనలేని సాహసం చేస్తున్నారు. ఆర్థిక స్తోమత సరిగా లేకున్నా, తర్వాత సంపాదించుకోవచ్చనే ఆశతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నిలిచారు. ప్రస్తుతం పంటల దిగుబడి అంతంత మాత్రంగా ఉండటంతో, రెండో పంట వచ్చాక తిరిగి చెల్లిస్తామనే హామీతో అప్పులు తీసుకుని ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. ఈ అప్పుల పోరు ఎన్నికల వాతావరణాన్ని మరింత రంజుగా మారుస్తోంది.
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లా పరిధిలోని మూడు దశల్లో 869 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలకు 1,680 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే 100కి సమాచారం అందించాలని కోరారు.


