News June 21, 2024

ఈనెల 27న యాదాద్రి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ‌ ఆదాయాన్ని ఈనెల 27న లెక్కించనున్నట్లు గురువారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం హాల్ 2లో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లతో.. భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News September 15, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.

News September 15, 2024

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో ఓ యువతి అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. స్థానికుల వివరాలిలా.. మాల్‌తండా వాసి మౌనిక, పుట్టలగడ్డ తండాకు చెందిన రంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అమ్మాయి కోరడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఈ తెల్లవారుజామున మౌనిక విగతజీవిగా కనిపించింది. అమ్మాయి కుటుంబ సభ్యులు రంగా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2024

NLG: వినాయక మండపంలో విషాదం

image

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం జరిగింది. కిష్టరాంపల్లికి చెందిన వర్ధన్ అనే విద్యార్థి వినాయక మండపంలో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా వర్ధన్ చింతపల్లిలో ఇంటర్ చదువుతున్నాడన్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.