News March 8, 2025
ఈనెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఓరుగల్లు (వరంగల్)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
నెల్లూరు: రైతును చెరువులో తోసి నగదుతో పరార్

తక్కువ ధరకు డీజిల్ ఇస్తానని నమ్మించి ఓ అపరిచితుడు రైతును బూరిడీ కొట్టించిన ఘటన ఆదివారం మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఓ రైతుకు బైకుపై వచ్చిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. రైతుకు తక్కువ ధరకు 300 లీటర్లు డీజిల్ ఇస్తామని నమ్మించి 25 వేల రూపాయలను రైతు నుంచి తీసుకున్నాడు. అ తర్వాత ఆ రైతును చెరువులో తోసి పరారయ్యాడు.
News March 16, 2025
నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు.
News March 16, 2025
SRH: ఈసారి 300 పక్కా.. తగ్గేదేలే!

IPL 2025 కోసం SRH సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచులు మొదలుపెట్టింది. ఈ మ్యాచుల్లో జట్టు ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. SRH-A ఆటగాళ్లు అయితే 5.4 ఓవర్లలోనే 100 పరుగులు బాదేశారు. ఈ జోరు చూస్తుంటే ఈసారి కచ్చితంగా 300 పరుగులు దాటిస్తారని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా గత సీజన్‌లో RCBపై SRH 287/3 పరుగులు చేసి IPL చరిత్రలోనే హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.