News March 25, 2024

ఈనెల 27 పర్ణశాల,28 భద్రాచలంలో హుండీల లెక్కింపు

image

దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో ఈనెల 27న, భద్రాచలం దేవస్థానంలో ఈనెల 28న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి హుండీ, లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గమనించాలని తెలియజేశారు.

Similar News

News November 9, 2024

‘భద్రాద్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు’

image

భద్రాద్రి ఆలయంలో బ్రహ్మోత్సవాల తేదీలను శుక్రవారం ఆలయ వైదిక పెద్దలు ఖరారు చేశారు. డిసెంబర్ 31 నుంచి అధ్యయన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జనవరి 9న తెప్పోత్సవం, 10న వైకుంఠ ద్వార దర్శనం, 12న విశ్వరూప సేవ ఉంటుందన్నారు. అధ్యయన ఉత్సవాల్లో భాగంగా దశావతారాలలో రామయ్య దర్శమిస్తారని తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

News November 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాను వణికిస్తున్న చలి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం వణికిపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు సుమారు 15 డిగ్రీలు నమోదవుతోంది. ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతవరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంతో.. చిన్నపిల్లలు వృద్ధుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News November 8, 2024

ఖమ్మం: సమగ్ర సర్వేపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సర్వే నిర్వహణకు నిర్దేశించిన ఫార్మాట్లో ఫారాలు సిద్ధమయ్యాయా, సిబ్బందికి అవసరమైన పరికరాలు, స్టేషనరీ ఐటెమ్స్ పంపిణీ మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.