News January 20, 2025
ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు
Similar News
News December 6, 2025
కరీంనగర్: అంబేడ్కర్కు బండి సంజయ్ నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News December 6, 2025
కరీంనగర్లో రెచ్చిపోతున్న ‘భూ’ బకాసురులు..!

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ మాఫియా మళ్లీ రెచ్చిపోతుంది. భగత్ నగర్లోని ఓ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేయగా లేక్ PS ముందు ఓ ఫ్లాట్లో నిర్మించిన గోడను కూల్చేశారు. రాంనగర్లోని పార్క్ స్థలమూ కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. అభిషేక్ మహంతి CPగా ఉన్నప్పుడు కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసి భూ బకాసురులపై ఉక్కుపాదం మోపారు. CP మారడంతో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
News December 5, 2025
ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.


