News January 20, 2025
ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు.
Similar News
News February 16, 2025
వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.
News February 16, 2025
WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.