News September 23, 2024
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ నెల 28న జిల్లా కోర్టులో నిర్వహించనున్నారని, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు ఉన్నవారు సామరస్య ధోరణితో రాజీ పడదగిన ఆయా కేసులపై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు.
Similar News
News November 25, 2025
పాపన్నపేట: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడి సూసైడ్

పాపన్నపేట మండలం కొత్తపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమేష్ ముదిరాజ్(23) కుటుంబ సమస్యలతో గొడవ పడి రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. సోదరికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పడంతో అతని కోసం గాలించినా ఆచూకీ లభించదు. ఉదయం స్కూల్ వెనకాల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
News November 25, 2025
మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
News November 25, 2025
మెదక్: కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.


